ఆహ్లాదం పంచేలా వనాలు
eenadu telugu news
Published : 22/10/2021 00:47 IST

ఆహ్లాదం పంచేలా వనాలు


స్థలాన్ని పరిశీలిస్తున్న అదనపు పాలనాధికారి చంద్రయ్య 

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: వైకుంఠధామాల నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి చంద్రయ్య అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తాండూరు మండలం గౌతాపూర్‌, కోటబాస్పల్లిలో వాటి నిర్మాణాలను, చెత్తదిబ్బ, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు.రెండు వారాల్లో పూర్తి చేయాలని డీఈ వెంకట్రావ్‌, ఏఈ సంతోష్‌, ఎంపీడీఓ సుదర్శన్‌రెడ్డికి సూచించారు. ప్రజలకు ఆహ్లాదం పంచేలా వనాలను తీర్చిదిద్దాలన్నారు. చెత్తను సేకరించి సేంద్రియ ఎరువు తయారు చేసి పంచాయతీ ఆదాయం పెంచాలని సూచించారు. సర్పంచులు నాగార్జున, రాజప్ప, ఎంపీఓ రతన్‌సింగ్‌, కార్యదర్శులు లాలప్ప, ఫకురోజీ ఉన్నారు.

గౌతాపూర్‌లో ప్రభుత్వ స్థల పరిశీలన: గౌతాపూర్‌లోని సర్వే సంఖ్య 32, 35లోని ప్రభుత్వ భూములను జిల్లా అదనపు పాలనాధికారి చంద్రయ్య గురువారం పరిశీలించారు. చెంగోల్‌, గౌతాపూర్‌ చెరువుల నీరు విద్యుత్‌ ఉప కేంద్రం పరిసరాల్లో పారుతుండటంతో వైకుంఠధామం నిర్మాణాన్ని చెత్త దిబ్బ వద్ద చేపట్టాలని సూచించారు. వరదనీరు పారేందుకు తీయాల్సిన కాల్వలపై తహసీల్దారు చిన్నప్పలనాయుడు, సర్పంచి రాజప్పతో మాట్లాడారు.

భూగర్భజలాల వివరాలు తెలుసుకోవడం సులువు

నవాబ్‌పేట, న్యూస్‌టుడే: భూగర్భజలాల వివరాలు తెలుసుకునేందుకు బోర్లు వేస్తున్నామని అదనపు కలెక్టరు చంద్రయ్య పేర్కొన్నారు. గురువారం భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో మండల పరిధి ఎక్‌మామిడి ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 34 బోర్లు వేయనున్నారు. 350 అడుగులు (100 మీటర్లు) మేర తవ్వుతున్నారు. వీటిని ప్రతి నెలా నీటి మట్టాన్ని తెలుసుకునేందుకు మాత్రమే వినియోగించనున్నారు. ఈసారి 100 అడుగుల్లో నీరు వచ్చిందని సంబంధిత శాఖ అధికారి తెలిపారు. కార్యక్రమంలో ఏడీ దీప, అధికారులు భాగ్య, లావణ్య, సర్పంచి రఫి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని