ఆదాయంలో పోటీ.. ఆర్టీసీ అధికారుల పేచీ
eenadu telugu news
Published : 22/10/2021 01:34 IST

ఆదాయంలో పోటీ.. ఆర్టీసీ అధికారుల పేచీ


ఎల్బీనగర్‌లో ఆగిన దిల్‌సుఖ్‌నగర్‌ డిపో బస్సు

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీలో పోటీ బాగా పెరిగింది. ఆదాయం కోసం అధికారులు పరుగులు పెడుతున్నారు. ఇది శుభ పరిణామమనే చెప్పాలి. కానీ ఈ పోటీ ఒక్కోసారి అధికారుల మధ్య వాగ్వాదానికి కారణమవుతోంది.

ఏమీ జరిగిందంటే.. ఈ నెల 14న ఖమ్మం వెళ్లే దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన డీలక్స్‌ బస్సు ఎల్‌బీనగర్‌ చౌరస్తాకు చేరుకుంది. ఖమ్మం డిపోకు చెందిన అధికారులు ఈ బస్సును అడ్డుకున్నారు. ఈ మార్గంలో మా డిపోకు చెందిన బస్సులు నడుస్తున్నాయని.. మీ వాహనాలను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. కండక్టర్‌, డ్రైవర్‌పై బూతులతో విరుచుకుపడ్డారు. మీరంతా బస్సు దిగండి.. వేరే వస్తుంది.. అందులో కూర్చోండంటూ ఖమ్మం డిపో అధికారి హుకుం జారీ చేశారు. ఆఖరుకు 20 మంది ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ఖమ్మం వెళ్లిపోగా.. మరి కొంత సమయానికి దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన డీలక్స్‌ బస్సు కూడా కదిలింది. ఇలా దాదాపు గంట సమయం ఎల్‌బీనగర్‌లోనే బస్సు ఆగిపోయింది. ఆర్టీసీ అధికారుల మధ్య సమన్వయం కొరవడుతోందని తెలుస్తోంది. ఎవరి డిపోలు వారివేనని, కానీ రోడ్డెక్కిన తర్వాత లడాయి తగదని ప్రయాణికులంటున్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు ట్విటర్‌ ద్వారా సంస్థ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని