మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక సెల్‌
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక సెల్‌

ఈనాడు, హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ రవాణా, వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. గురువారం ఈ విభాగాన్ని ప్రారంభించిన సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విభాగం ద్వారా డ్రగ్స్‌ రవాణాను అరికట్టడం, మాదక ద్రవ్యాలను ఏయే ప్రాంతాల నుంచి ఎవరెవరు తీసుకువస్తున్నారో నిఘా వేస్తారు. ఎక్సైజ్‌శాఖ సహకారంతో డ్రగ్స్‌ రవాణా, వినియోగంపై మరింత సమాచారం సేకరించి చర్యలు చేపట్టనున్నారు. డీసీపీ (నేరాలు) రోహిణి ప్రియదర్శిని, డీసీపీ (ఎస్‌వోటీ)సందీప్‌ ఇతర అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

గంజాయి మూలాలను శోధించండి.. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో గంజాయి సరఫరా, వినియోగంపై పోలీసులు దృష్టి కేంద్రీకరించాలని కొత్వాల్‌ అంజనీకుమార్‌ గురువారం పోలీస్‌ అధికారులతో అన్నారు. ఆయన దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఠాణా పరిధిలో గంజాయి మూలాలను శోధించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని