కర్ణాటక సంపర్క్‌ కాంత్రి రైలు గడువు పొడిగింపు
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

కర్ణాటక సంపర్క్‌ కాంత్రి రైలు గడువు పొడిగింపు

కాచిగూడ, న్యూస్‌టుడే: యశ్వంత్‌పూర్‌-కాచిగూడ-హజ్రత్‌ నిజాముద్దీన్‌ కర్ణాటక సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలు గడువును అక్టోబరు 27 నుంచి తదుపరి ఆదేశాల వచ్చేవరకు నిరవధికంగా నడుపనున్నారు. బెంగళూరు నుంచి వచ్చే రైలు కాచిగూడ నుంచి సోమ, మంగళ, గురు, శని, ఆదివారాల్లో ఉదయం 8.20 గంటలకు దిల్లీ హజ్రత్‌ నిజాముద్దీన్‌కు బయలుదేరి వెళ్తుంది. దిల్లీ నుంచి వచ్చే రైలు కాచిగూడ నుంచి సోమ, మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 8.40 గంటలకు బెంగళూర్‌ యశ్వంత్‌పూర్‌కు వయా హుబ్లీ మీదుగా వెళ్తుంది.

కాచిగూడ-టాటానగర్‌..

కాచిగూడ: కాచిగూడ-టాటానగర్‌ వారాంతపు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు గడువును వారం పొడిగించారు. కాచిగూడ నుంచి శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు టాటానగర్‌కు వెళ్తుంది. ఈ నెల 23, 30, నవంబరు 6న కాచిగూడ నుంచి టాటానగర్‌కు నడుపనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని