పట్టుబట్టారు.. ప్రథమ స్థానంలో నిలిచారు
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

పట్టుబట్టారు.. ప్రథమ స్థానంలో నిలిచారు

పీజీ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన నగర విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలో నగర విద్యార్థులు సత్తాచాటారు. చాలావరకు సబ్జెక్టుల్లో నగరానికి చెందిన విద్యార్థులు మొదటి మూడు ర్యాంకులు సాధించారు. పీజీలో చేరి భవిష్యత్తులో మొదటి ర్యాంకు దక్కించుకున్న విద్యార్థులు ‘ఈనాడు’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా...


గత ప్రశ్నపత్రాలు ప్రాక్టీసు చేశా

వి.హరిప్రియ, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ మొదటి ర్యాంకు, మదీనాగూడ

తొలుత డిగ్రీ అయ్యాక ఉద్యోగం చేద్దామని అనుకున్నప్పటికీ, తల్లిదండ్రులు పద్మ, వీఎన్‌వీ సత్యనారాయణ ప్రోత్సాహంతో ఉన్నత విద్య చేస్తున్నా. తర్వాత పీహెచ్‌డీ చేయాలనుంది. రోజుకు 10-12 గంటలు చదివా. కొన్ని సెంట్రల్‌ విశ్వవిద్యాలయాల్లోనూ ప్రవేశం లభించింది.


బ్యాక్‌లాగ్‌ నుంచి మొదటి ర్యాంకు సాధించా

నిఖిల్‌కుమార్‌, ఎమ్మెస్సీ మ్యాథ్స్‌, మల్లాపూర్‌

నారాయణగూడలో బీజేఆర్‌ కళాశాలలో డిగ్రీ చేశా. సెకండియర్‌లో గణితంలో బ్యాక్‌లాగ్‌ ఉండేది. దాన్ని కష్టపడి చదివి పూర్తి చేశా. మూడు నెలలు బాగా చదివి, గణితంలో బేసిక్స్‌పై పట్టు సాధించా. అందుకే ప్రథమర్యాంకు సాధ్యమైంది.


సొంతంగా ప్రిపేర్‌ అయ్యా

జొన్నలగడ్డ శ్రీదివ్య, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌, అశోక్‌నగర్‌

కోఠి మహిళా కళాశాలలో డిగ్రీ చేశా. ప్రత్యేకంగా కోచింగ్‌ తీసుకోవడంతోపాటు సొంతంగా ప్రిపేర్‌ అయ్యా. స్టాటిస్టిక్స్‌లో ఉన్నత చదువులు చదవాలనుంది. భవిష్యత్తులో పరిశోధనలు చేయాలనుంది. ఇంటర్‌ 99శాతం, డిగ్రీ సీజీపీఏ 10 సాధించా.


డ్రగ్‌కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేస్తా

దీక్షిత కులకర్ణి, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌

డిగ్రీ భవన్స్‌ వివేకానంద కళాశాలలో చేశా. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ.. ప్రవేశ పరీక్షలు రాశా. బయోటెక్నాలజీలో మొదటి ర్యాంకు రాగా.. రసాయనశాస్త్రంలో 16వ ర్యాంకు వచ్చింది. నాకు రసాయనశాస్త్రంపై ఎక్కువగా ఆసక్తి. అందుకే అందులోనే ఎమ్మెస్సీ చేయాలనుకుంటున్నా.


తెలుగు అకాడమీ పుస్తకాలు చదివా

రాయప్రోలు సాత్విక, ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ, నాగారం

నాకు 9వ తరగతి నుంచి రసాయనశాస్త్రంపై బాగా ఆసక్తి పెరిగింది. ఫిజికల్‌ కెమిస్ట్రీ బాగా చదువుతాను. నీట్‌తోపాటు సీపీగెట్‌ రాశా. పరీక్ష కోసం తెలుగు అకాడమీ పుస్తకాలు బాగా చదివా. ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ చేశాక ఇదే రంగంలో పరిశోధన చేయాలనుకుంటున్నా.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని