నగరం తొలి అపార్ట్‌మెంట్‌ నందనంలో నేలకొరిగిన మహా వృక్షం
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

నగరం తొలి అపార్ట్‌మెంట్‌ నందనంలో నేలకొరిగిన మహా వృక్షం

ధ్వంసమైన ఆరు కార్లు

అబిడ్స్‌, న్యూస్‌టుడే: నగరంలోనే తొలి అపార్ట్‌మెంట్‌గా ప్రసిద్ధిగాంచిన ఆబిడ్స్‌ చిరాగ్‌అలీలేన్‌లోని నందనం అపార్ట్‌మెంట్‌లో నలభై రెండేళ్లచరిత్ర ఉన్న మహా వృక్షం గురువారం నేలకొరిగింది. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఆరు కార్లు మాత్రం ధ్వంసమయ్యాయి. విద్యుత్తు తీగలు తెగి కరెంటు సరఫరాకు అంతరాయం కల్గింది. ఈ అపార్ట్‌మెంట్‌ను 42 ఏళ్ల క్రితం నిర్మించారు. నిత్యం సాయంత్రం ఆరు గంటలకు అపార్ట్‌మెంట్‌కు చెందిన చిన్నపిల్లలు ఆడుకోడానికి కిందకు దిగుతారు. పది నిమిషాల ముందు ఈ ప్రమాదం సంభవించింది. అపార్ట్‌మెంట్‌ అధ్యక్షుడు భరత్‌కుమార్‌ షా సమాచారంతో ఆబిడ్స్‌ సీఐ ప్రసాద్‌రావు, జీహెచ్‌ఎంసీ డీసీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కార్పొరేటర్‌ డా.సురేఖ ఓంప్రకాశ్‌ వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని