షిరిడీకి మళ్లీ టీఎస్‌ఆర్టీసీ బస్సులు
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

షిరిడీకి మళ్లీ టీఎస్‌ఆర్టీసీ బస్సులు

ఈనాడు, హైదరాబాద్‌: దసరాకు వారం ముందు నుంచి షిరిడీ సందర్శనకు అనుమతి లభించడంతో టీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా పునరుద్ధరించింది. ప్రయాణికులు బస్సుల ద్వారా నేరుగా అక్కడికి వెళ్లడంతో దర్శనం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ఎవరికి వారు ముందుగానే దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకొని, తరువాతే ప్రయాణాలకు సిద్ధం కావాలని ఆర్టీసీ, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు. గరుడ ప్లస్‌, రాజధాని ఏసీ బస్సులతో పాటు సూపర్‌లగ్జరీ బస్సులను ఎంజీబీఎస్‌ నుంచి నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ చెప్పారు. నగరం నుంచి తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ కూడా బస్సులు(వోల్వో మాత్రమే) నడుపుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని