చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నా
eenadu telugu news
Updated : 22/10/2021 09:47 IST

చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నా

మంత్రి కేటీఆర్‌


బ్రోచర్‌ ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్‌, అర్వింద్‌కుమార్‌, ఖాదిర్‌అలీబేగ్‌, జయేశ్‌రంజన్‌

అబిడ్స్‌, న్యూస్‌టుడే: ‘నా చిన్నతనంలో మా ఇల్లు ఎంజే మార్కెట్‌కు సమీపంలోనే ఉండేది. కూరగాయల కోసం నేను కూడా ఇక్కడికి వచ్చేవాడిని. మంత్రిని అయ్యాక ఎంజే మార్కెట్‌ను సందర్శించిన సందర్భంలో అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి మరమ్మతులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. చారిత్రక మోజంజాహీమార్కెట్‌లో ఖాదర్‌ అలీ బేగ్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ గురువారం రాత్రి సుమారు రెండు గంటల పాటు ఇక్కడే గడిపారు. అంతకుముందు ఆయన ప్రసంగిస్తూ.. నగరంలోని పర్యాటక కేంద్రాల్లో ఎంజే మార్కెట్‌ కూడా ఒకటని, దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఐటీముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని