మైక్రోసాఫ్ట్‌ ఉచిత ఉపాధి శిక్షణ
eenadu telugu news
Published : 23/10/2021 02:10 IST

మైక్రోసాఫ్ట్‌ ఉచిత ఉపాధి శిక్షణ

కాచిగూడ, న్యూస్‌టుడే: సామాజిక బాధ్యతలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ సంస్థ గ్రేటర్‌లోని నిరుద్యోగ యువజనులకు 3 నెలల ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్మాణ్‌ సంస్థ సమన్వయకర్త కె.నిరంజన్‌యాదవ్‌ తెలిపారు. శుక్రవారం కాచిగూడలో ఆయన మాట్లాడారు. 22-27 ఏళ్ల మధ్య వయసు కలిగి బీటెక్‌, ఎంటెక్‌(ఐటీ, సీఎస్‌ఈ, ఈసీఈ), బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్‌లో 2017-21లలో ఉత్తీర్ణులైన వారికి ఆన్‌లైన్‌లో మైక్రోసాఫ్ట్‌ నెట్‌ కోర్సులో సీచి.నెట్‌, ఏఎస్‌పీ.నెట్‌, ఏడీఓ.నెట్‌, హెచ్‌టీఎంఎల్‌5, సీఎస్‌ఎస్‌3, ఎస్‌క్యూఎల్‌.సర్వర్‌, జావా స్క్రిప్ట్‌, ఎక్స్‌ఎంఎల్‌+, ఎక్స్‌ఎస్‌ఎల్‌టీ, జేక్వైరీ, సాఫ్ట్‌ స్కిల్స్‌, రియల్‌ టైమ్‌ ప్రాజెక్ట్‌, మొబైల్‌ అప్లికేషన్‌ అభివృద్ధి కోర్సులో ఆంగ్‌లర్‌9, హెచ్‌టీఎంఎల్‌, బూట్స్‌ ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, ఎంవైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ, ఇంటర్య్యూ తదితర కోర్సుల్లో శిక్షణానంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. వివరాలకు 9100810928, 9553603509లలో సంప్రదించాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని