పారా మెడికల్‌ విద్యతో ఉపాధి: ఎయిమ్స్‌ ఈడీ
eenadu telugu news
Published : 23/10/2021 02:10 IST

పారా మెడికల్‌ విద్యతో ఉపాధి: ఎయిమ్స్‌ ఈడీ

 

వర్సిటీ బ్రోచర్‌తో వికాస్‌ భాటియా, బొల్లినేని భాస్కర్‌రావు తదితరులు

మైసమ్మగూడ(మేడ్చల్‌ గ్రామీణం): పారామెడికల్‌ విద్య సేవతోపాటు ఉపాధికి తోడ్పడుతుందని ఎయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆచార్య డాక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు. మేడ్చల్‌ మండలం మైసమ్మగూడలోని మల్లారెడ్డి వర్సిటీలో పారామెడికల్‌, అలైడ్‌ మెడికల్‌ సైన్స్‌ కోర్సులపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వికాస్‌భాటియాతో పాటు కిమ్స్‌ ఎండీ బొల్లినేని భాస్కర్‌రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా రాబోయే పదేళ్లలో 48 లక్షల మంది పారామెడికల్‌ సిబ్బంది అవసరముందన్నారు. వీసీ వీఎస్‌కే రెడ్డి, ఎయిమ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కల్నల్‌ అనంతరావు, మల్లారెడ్డి ఆస్పత్రి ఛైర్మన్‌ భద్రారెడ్డి, మల్లారెడ్డి హెల్త్‌ సిటీ ఎండీ ప్రీతీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని