ముద్ర ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
eenadu telugu news
Published : 23/10/2021 02:10 IST

ముద్ర ఉద్యోగి ఆత్మహత్యాయత్నం


వీరభద్రం

నల్లకుంట, న్యూస్‌టుడే: న్యాయం చేయాలంటూ ముద్ర సొసైటీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏడాదిగా వేతనాలు ఇవ్వకుండా, ఖాతాదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి చెల్లించకుండా ముద్ర వ్యవసాయ, నైపుణ్యాభివృద్ధి బహుళార్ధ సహకార సొసైటీ ఛైర్మన్‌ రామదాసప్పనాయుడు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. మూడు రోజులుగా వివిధ జిల్లాల ఉద్యోగులు నల్లకుంటలో ముద్ర కేంద్ర కార్యాలయంవద్ద ధర్నాలు చేస్తున్నారు. మహబూబాబాద్‌కు చెందిన వీరభద్రం(24) శుక్రవారం వచ్చాడు. తోటి ఉద్యోగులతో కొద్దిసేపు గడిపాడు. తర్వాత అక్కడినుంచి పక్కకు వెళ్లి.. సంస్థ మోసం చేసిందంటూ వీడియో రికార్డింగ్‌లో మాట్లాడుతూ పురుగుల మందు తాగాడు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే 108కు ఫోన్‌ చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారించి కేసు నమోదు చేయనున్నట్లు సీఐ మొగిలిచర్ల రవి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని