లారీ ఢీకొని విశ్రాంత ఉద్యోగి దుర్మరణం
eenadu telugu news
Published : 23/10/2021 02:10 IST

లారీ ఢీకొని విశ్రాంత ఉద్యోగి దుర్మరణం


రామచంద్రారెడ్డి

కీసర, న్యూస్‌టుడే: కిరాణా దుకాణానికి వెళ్తూ.. లారీ ఢీ కొని విశ్రాంత ఉద్యోగి దుర్మరణం చెందిన ఘటన కీసర ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండలం కరీంగూడకు చెందిన సింగిరెడ్డి రామచంద్రారెడ్డి(63) ఈసీఐఎల్‌లో పని చేసి పదవీ విరమణ పొందారు. సొంత గ్రామం వదిలి నాగారంలో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి తన ద్విచక్ర వాహనంపై కిరాణా దుకాణానికి వెళ్లారు. ఈ క్రమంలో రాంపల్లి చౌరస్తాలో రోడ్డు క్రాస్‌ చేస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి నేత్రాలను ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి దానం చేసినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని