మహా టీకోతా్సహం!
eenadu telugu news
Published : 23/10/2021 02:57 IST

మహా టీకోతా్సహం!

1.15 కోట్ల డోసుల పంపిణీ పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: మహానగరంలో టీకోత్సాహం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వందకోట్ల డోసులు పూర్తి అవ్వగా...అదే దూకుడు ఇక్కడా కొనసాగుతోంది. మహానగర పరిధిలోకి వచ్చే హైదరాబాద్‌, మల్కాజిగిరి-మేడ్చల్‌, రంగారెడ్డి పరిధిలో 1.15 కోట్ల టీకా డోసులు పూర్తయ్యాయి. రెండో డోసు విషయంలో కొంత వేగం పెంచాల్సిన ఉన్నా సరే.. మొత్తంగా పరిశీలిస్తే కరోనాపై టీకా యుద్ధం శరవేగంగా కొనసాగుతోంది. గత నెలన్నర నుంచి రోజుకు 70-80 వేల మంది టీకా తీసుకుంటున్నారు. మూడు జిల్లాల్లో 765 కేంద్రాల్లో టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో వందశాతం టీకా పూర్తి చేశారు. కొందరు తొలి డోసు తీసుకున్నప్పటికీ గడువు దాటినా రెండో డోసు విషయంలో తాత్సారం చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని