వృద్ధురాలిపై ఆవు దాడి
eenadu telugu news
Published : 23/10/2021 15:37 IST

వృద్ధురాలిపై ఆవు దాడి

హైదరాబాద్‌: జవహర్‌ నగర్‌ పరిధిలోని శాంతి నగర్‌ కాలనీలో ఓ వృద్ధురాలిపై ఆవు దాడి చేసింది. స్థానికంగా నివాసం ఉండే పోచమ్మ అనే వృద్ధురాలు తన బంధువుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో దారి మధ్యలో పోచమ్మపై ఆవు దాడి చేసింది. కొమ్ములతో పొడిచి ఒక్కసారిగా పైకి ఎత్తి కిందకు పడేసింది. ఈ ఘటనలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకొని.. బాధితురాలిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని