రైతన్న పాదయాత్ర
eenadu telugu news
Published : 24/10/2021 00:49 IST

రైతన్న పాదయాత్ర

కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఓ రైతు చేపట్టిన పాదయాత్ర సిద్దిపేటకు చేరుకుంది. సూర్యాపేట జిల్లా కీతవారిగూడెం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు మెడలో ఫ్లకార్డుతో సికింద్రాబాద్‌ నుంచి ఈ నెల 18న పాదయాత్రను ప్రారంభించారు. శనివారం జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలతో అనేక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని కోరారు. ఆసిఫాబాద్‌ వరకు పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారు. తన రెండు ఎకరాల భూమికి సంబంధించి కొందరు నకిలీ పట్టాలు సృష్టించారని, న్యాయం చేయాలని విన్నవించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని కాంక్షిస్తూ 2005, 2006 సంవత్సరాల్లో 60 రోజుల పాటు పాదయాత్ర చేసినట్లు వివరించారు.

- న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని