బాలికపై బాలుడి అత్యాచారం
eenadu telugu news
Published : 24/10/2021 02:08 IST

బాలికపై బాలుడి అత్యాచారం

గర్భం దాల్చడంతో పోలీసులకు ఫిర్యాదు

సైదాబాద్‌, న్యూస్‌టుడే: పదిహేనేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన సైదాబాద్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భవతిగా నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఐఎస్‌సదన్‌ డివిజన్‌ పరిధిలోని ఓ బస్తీలో ఉండే బాలిక(15), అదే ప్రాంతంలో ఉండే బాలుడు(16) తమ కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. కాగా బాలుడు పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం బాలిక తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతుండగా తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్ష చేసిన వైద్యులు ఐదు నెలల గర్భవతిగా గుర్తించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు బాలుడితోపాటు కుటుంబ సభ్యులను మందలించారు. రాజీకి ప్రయత్నం జరిగినా బాలిక కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. శనివారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకుని బాలుర సంరక్షణ కేంద్రానికి తరలించారు. మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని