కారు, ఆటో ఢీ.. ఒకరి దుర్మరణం
eenadu telugu news
Published : 25/10/2021 01:21 IST

కారు, ఆటో ఢీ.. ఒకరి దుర్మరణం

సంగారెడ్డి గ్రామీణం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి గ్రామీణ ఠాణాలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సుభాష్‌ తెలిపిన వివరాల ప్రకారం... చింతలపల్లికి చెందిన మల్లేశం(47) పెయింటర్‌గా పని చేస్తూ ఆటో నడుపుతుంటాడు. పనుల నిమిత్తం శనివారం ఆటోలో జిన్నారం వెళ్లి వస్తుండగా ఇస్మాయిల్‌ఖాన్‌ పేట్‌ సమీపంలోఎదురుగా వస్తున్న కారు  ఢీ కొనడంతో మల్లేశం మృతి చెందారు. ఆదివారం కొడుకు అరవింద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని