శుభకార్యానికి వెళ్లి వస్తుండగా మరొకరు..
eenadu telugu news
Published : 25/10/2021 01:21 IST

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా మరొకరు..

గజ్వేల్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో మృతిచెందిన ఘటన గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద రాజీవ్‌ రహదారిపై చోటుచేసుకుంది. గజ్వేల్‌ సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాలు.. రాయపోల్‌ మండలం టెంకంపేటకు చెందిన కొరే మల్లశ్‌ (48) ఆదివారం జగదేవపూర్‌ మండలం చిన్నకిష్టాపూర్‌ తన సోదరుడి కుమార్తె ఇంట్లో జరిగిన శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి బయల్దేరగా, మార్గమధ్యలో రిమ్మనగూడ వద్దకు రాగానే తన వాహనంలో పెట్రోల్‌ అయిపోయింది. దీంతో వాహనాన్ని అక్కడే నిలిపి, సీసాలో పెట్రోలు తీసుకొద్దామని బంక్‌కు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ప్రజ్ఞాపూర్‌ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న అతివేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని గజ్వేల్‌ ఆస్పత్రికి తరలించడగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. మృతుడి భార్య మల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని