విద్యుదాఘాతంతో రైతు..
eenadu telugu news
Published : 25/10/2021 01:21 IST

విద్యుదాఘాతంతో రైతు..

నర్సాపూర్‌ రూరల్‌, న్యూస్‌టుడే: చేతికొచ్చిన పంటను నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన ఘటన నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ గంగరాజు తెలిపిన వివరాలు.. చిన్నచింతకుంటకు చెందిన ఒంటెల శ్రీనివాస్‌రెడ్డి (48)కి మూడెకరాల పొలం ఉండగా, దాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం పొలంలో యంత్రంతో వరి నూర్పిడి చేస్తున్న క్రమంలో బోరుబావికి చెందిన విద్యుత్తు తీగను పక్కకు జరుపుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. అక్కడున్న వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య అనసూయ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారికి వివాహాలు అయ్యాయి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని