హత్య కేసులో నిందితుని అరెస్టు
eenadu telugu news
Published : 25/10/2021 01:21 IST

హత్య కేసులో నిందితుని అరెస్టు

నిందితునితో ఆర్‌పీఎఫ్‌ పోలీసులు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: హత్య కేసులో ప్రధాన నిందితుడిని వికారాబాద్‌ రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌) పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆర్‌పీఎఫ్‌ సీఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో మాల్వానీ పోలీస్‌ ఠాణా పరిధిలో ఇటీవల ఓ హత్య జరిగింది. హత్యలో ప్రధాన నిందితుడైన అల్లావుద్దీన్‌ ఖాన్‌ అలియాస్‌ ఆల్టో శుక్రవారం రాత్రి ముంబయి నుంచి హుస్సేన్‌ సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో హైదరాబాద్‌కు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వికారాబాద్‌ ఆర్‌పీఎఫ్‌ పోలీసులు నిందితుని కోసం రైల్లో అన్వేషించి, సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తున్న నిందితుడిని అరెస్టు చేసి మాల్వానీ పోలీసులకు అప్పగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని