లారీ.. ద్విచక్ర వాహనం ఢీ..
eenadu telugu news
Published : 25/10/2021 01:21 IST

లారీ.. ద్విచక్ర వాహనం ఢీ..

యువకుడి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

అనిల్‌  

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: మండలంలోని లొట్టిగుంట తండాకు చెందిన మాణికిభాయి, హన్మంతులకు ఇద్దరు కుమారులు. వీరిలో ఒకరు అనిల్‌. బతుకుదెరువు నిమిత్తం తల్లిదండ్రులు పుణె వెళ్లారు. కుమారులు గ్రామంలోని అవ్వ, తాతల దగ్గరే ఉంటున్నారు. అనిల్‌ ఐటిఐ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కుమారుడు ఉద్యోగం సాధిస్తే ఇక్కడే ఉందామనుకున్న తరుణంలో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని విషాదం పాలు చేసింది. శిక్షణ ఎస్సైలు ప్రత్యూషగౌడ్‌, ముకేష్‌ వర్ధన్‌లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం అనిల్‌ (20) తన స్నేహితుడు మహేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై నారాయణపేట జిల్లా మద్దూరుకు వెళ్లారు. దేవర్‌పస్లావాద్‌ సమీపంలో మద్దూరు నుంచి దౌల్తాబాద్‌ వైపు వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఇరువురికీ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మద్దూరుకు ఆటోలో తరలిస్తుండగా అనిల్‌ మార్గ¢మధ్యలో మృతిచెందాడన్నారు. మహేష్‌కు మెరుగైన వైద్యం నిమిత్తం మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. మృతుని బాబాయి జైల్‌సింగ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైలు తెలిపారు. చేతికొచ్చిన కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంలో ఆ కుటుంబ సభ్యుల రోదన పలువురిని కన్నీరు పెట్టించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని