సైబరాబాద్‌లో రెండు వికెట్లు..
eenadu telugu news
Published : 25/10/2021 02:50 IST

సైబరాబాద్‌లో రెండు వికెట్లు..

నార్సింగి సీఐ, ఎస్సైపై వేటు

ఈనాడు, హైదరాబాద్‌: సైబరాబాద్‌లో ప్రక్షాళన మొదలైంది. తొలి వికెట్‌ పడింది. అవినీతి ఆరోపణలు, భూవివాదాల్లో తలదూర్చడం, అధికార దుర్వినియోగం తదితర ఆరోపణలపై నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతోపాటు అదే ఠాణాలో పనిచేసిన ఎస్సై లక్ష్మణ్‌పై కూడా చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

‘రేంజ్‌’కు వెళ్లిపోవొచ్చు...
సైబరాబాద్‌ సీపీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టీఫెన్‌ రవీంద్ర 36 లాఅండ్‌ఆర్డర్‌ ఠాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి సీఐ(ఎస్‌హెచ్‌వో) పనితీరుపై పూర్తిస్థాయిలో పరిశీలించారు. ఫిర్యాదీదారులతో ఎలా మాట్లాడుతున్నారు..? భూవివాదాల్లో తల దూర్చుతున్నారా..? అవినీతి ఆరోపణలేమైనా ఉన్నాయా..? అంటూ నివేదిక తెప్పించుకున్నారు. పనితీరు సరిగా లేని వారిని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే రేంజ్‌కు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. చాలా మంది సీఐలు స్టేషన్లకే పరిమితమవుతున్నారు. కనీసం ఫిర్యాదు చేసేందుకొచ్చిన వారితోనూ మాట్లాడటం లేదు. కొన్ని ఠాణాల్లో సీఐని కలవాలంటే అది అసాధ్యమే. ఇదే అంశంపై పలు ఫిర్యాదులు అందటంతో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అప్రమత్తమయ్యారు. రోజు రెండు గంటలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. నిజంగానే వెళ్తున్నారా..? ఠాణాలకే పరిమితమవుతున్నారా..? అంటూ ఎప్పటికప్పుడు విచారణ చేయిస్తూ నివేదిక తెప్పించుకుంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని