TSRTC: భాగ్యనగరంలో ఆ 6 గంటలకు బస్సులుంచుతాం
eenadu telugu news
Updated : 25/10/2021 07:50 IST

TSRTC: భాగ్యనగరంలో ఆ 6 గంటలకు బస్సులుంచుతాం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో సిటీ బస్సుల సర్దుబాటుపై టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ దృష్టి పెట్టింది. డిమాండ్‌ ఉన్న మార్గాలను ఇప్పటికే గుర్తించామని.. ప్రయాణికుల అవసరాల మేరకు బస్సులన్నీ అందుబాటులోకి తెస్తున్నామని చెప్పింది. ఉదయం 8 నుంచి 11 గంటలు.. సాయంత్రం 4 నుంచి 7 వరకు కార్యాలయాలు, విద్యాలయాల నుంచి వచ్చి వెళ్లే వేళ బస్సుల్లో ప్రయాణించడానికి నగర ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘ఆ ఆరుగంటలు.. బస్సెక్కేదెలా’ అనే శీర్షికన ‘ఈనాడు’లో ఈ నెల 23న వచ్చిన కథనానికి ఆర్టీసీ అధికార గణం స్పందించింది. ఆ సమయంలో ప్రయాణాలు సాగుతున్న తీరుపై అధ్యయనం చేసింది. విద్యాలయాలు, కార్యాలయాలున్న మార్గాలను డిపోలవారీ సమీక్షించామని గ్రేటర్‌జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. 29 డిపోల్లో ఉన్న బస్సులన్నీ ఆ సమయాల్లో రోడ్డెక్కేలా చర్యలు తీసుకున్నామన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు డిపోమేనేజర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని