తీరంలో హుషారు
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

తీరంలో హుషారు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఫన్‌డే వేడుకలకు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఈ వారమూ సాయంత్రం వేళ భారీగానే వచ్చినా రాత్రి 7:30 గంటలకు భారత్‌-పాక్‌ ఆట మొదలవడంతో నగర జనం గడప దాటలేదు. దీంతో రాత్రివేళ గతవారాల్లా రద్దీ కనిపించలేదు. మరోవైపు పెద్దఎత్తున వాహనాలు వస్తున్నా పార్కింగ్‌ సదుపాయం కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలొస్తున్నాయి. నలుదిక్కులా పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినా అవగాహన కల్పించకపోవడంతో ప్రధాన రహదారిపైనే వాహనాలు నిలిపేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని