యువత మత్తుకు దూరంగా ఉండాలి
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

యువత మత్తుకు దూరంగా ఉండాలి

ఓయూలో యాంటీ డ్రగ్‌ అవేర్‌నెస్‌ వాక్‌ ప్రారంభించిన సీపీ

పోస్టర్లతో సీపీ అంజనీకుమార్‌, ఎమ్మెల్యే కాలేరు యాదయ్య, వీసీ ప్రొ.రవీందర్‌

లాలాపేట, న్యూస్‌టుడే: యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా దూరంగా ఉండాలని నగర సీపీ అంజనీకుమార్‌ సూచించారు. ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఎన్‌సీసీ గేట్‌ వరకు నగర పోలీసులు ఆదివారం ‘స్వచ్ఛ హైదరాబాద్‌-గాంజా రహిత హైదరాబాద్‌’ పేరుతో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన నడక(యాంటీ డ్రగ్‌ అవేర్‌నెస్‌ వాక్‌) నిర్వహించారు. ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్‌, బేతి సుభాష్‌రెడ్డి, ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌తో కలిసి అంజనీకుమార్‌ నడకను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని సూచించారు. తమ శక్తిని దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడేవిధంగా ఆదర్శవంతంగా మార్చుకోవాలన్నారు. ప్రధానంగా వసతిగృహాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్‌ రహితరాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ రమేష్‌రెడ్డి, అదనపు డీసీపీ మురళీధర్‌, కాచిగూడ ఏసీపీ శ్రీనివాస్‌, ఓయూ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌నాయక్‌తో పాటు పలు కళశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని