అభిమానికి చిరంజీవి వైద్యసాయం
eenadu telugu news
Updated : 25/10/2021 13:15 IST

అభిమానికి చిరంజీవి వైద్యసాయం

ఈనాడు, హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి.. అభిమానికి అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి ధైర్యాన్నిచ్చి వైద్యసేవల పొందేలా ఏర్పాటు చేస్తానన్నారు. విశాఖపట్నం నివాసి వెంకట్‌ కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ట్విటర్‌ ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని తన అభిమాన హీరో చిరుకు వివరిస్తూ, కలవాలని కోరారు. విమాన టికెట్లు పంపించిన ఆయన వెంకట్‌ దంపతులను హైదరాబాద్‌ రప్పించి, ఆదివారం ఉదయం తన నివాసంలో వారితో మాట్లాడారు. ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్నారు. వైద్య నివేదికలను పరిశీలించి స్థానిక ఒమెగా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి, వైద్యులతో ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. విశాఖలోని ఆసుపత్రిలో చేర్పించి వైద్యానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానని భరోసానిచ్చారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని