భార్యతో గొడవ..భర్త అనుమానాస్పద మృతి
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

భార్యతో గొడవ..భర్త అనుమానాస్పద మృతి

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: భార్యతో గొడవ పడిన భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సయ్యద్‌ మహమ్మద్‌ పాషా(39) పర్వీన్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆర్మీలో డ్రైవరుగా పనిచేసే పాషా 2016లో పదవీ విరమణ పొంది కుటుంబంతో కలిసి వెంకటగిరిలో నివసిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎస్‌బీఐ బ్యాంకు ఏటీఎం వద్ద కాపలాదారుగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. తాజాగా సొంతూరిలోని బోరు విషయంలోనూ గొడవ పడ్డారు. పర్వీన్‌ పిల్లలను తీసుకొని ఈనెల 13న గిద్దలూరు వెళ్లి, 16న తిరిగి పోలీసు బెటాలియన్‌ క్వార్టర్స్‌లో ఉన్న తల్లి ఇంటికి వచ్చింది. పాషా ఈనెల 22న అక్కడికి వెళ్లి భార్యతో వాదులాడారు. అదే రోజు రాత్రి పాషా వాటర్‌ ట్యాంకునకు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మద్యానికి అలవాటుపడి మృతిచెందాడని, ఎలాంటి అనుమానాలు లేవని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని