పద్యవిద్య ప్రవీణుడు రామకృష్ణమాచార్య
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

పద్యవిద్య ప్రవీణుడు రామకృష్ణమాచార్య

రచయిత్రులకు జ్ఞాపికలు అందజేస్తున్న శ్రీధర్‌

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: పద్యవిద్య ప్రవీణుడు రామకృష్ణమాచార్య అని కేంద్ర సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ అన్నారు. ఆదివారం త్యాగరాయ గాన సభ కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించిన నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం, నవ్య సాహితీ సమితీ సంయుక్తాధ్వర్యంలో మహాకవి నండూరి రామకృష్ణమాచార్య శతజయంతి ఉత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. తెలుగు, సంస్కృత భాషా సాహిత్యాల్లో అసమాన ప్రతిభ గల రామకృష్ణమాచార్య ప్రభంద, పౌరాణిక గ్రంథాలను తాత్కిక దృష్టితో వివరించారన్నారు. ఈ సందర్భంగా రచయిత్రులు డా.ఎం.భారతి, పి.రాజ్యలక్ష్మిని సత్కరించి అభినందించారు. కె.సాగర్‌రావు అధ్యక్షత వహించిగా, డా.భారతి, విజయ్‌కుమార్‌, ఆచార్య ఫణీంద్ర, కళాజనార్ధనమూర్తి, గాంధీ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని