సట్టా నిర్వాహకుల అరెస్టు
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

సట్టా నిర్వాహకుల అరెస్టు

ధూల్‌పేట, న్యూస్‌టుడే: ధూల్‌పేట కేంద్రంగా నగర పోలీసులు ప్రారంభించిన ‘గంజాయి ముక్త్‌ హైదరాబాద్‌’ ఆపరేషన్‌లో గంజాయి, సట్టా, గుట్కాల అక్రమ వ్యాపారాలు బయట పడుతున్నాయి. మంగళ్‌హాట్‌ సీఐ రవి, ఎస్సైలు జగన్‌, రాజశేఖర్‌రెడ్డి బృందం ఆదివారం దాడులు నిర్వహించింది. ఇద్దరు సట్టా నిర్వాహకులు, ఓ గుట్కా వ్యాపారి చిక్కారు. అప్పర్‌ ధూల్‌పేటకు చెందిన విష్ణుసింగ్‌(23), సైదాబాద్‌కు చెందిన మహ్మద్‌ అన్వర్‌(43)ను అరెస్టు చేశారు. రూ.70,650, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మంగళ్‌హాట్‌ మార్కెట్‌లోని కిరాణా దుకాణంలో గుట్కాలు విక్రయిస్తున్న చంద్‌ కుమావత్‌(28)ను అరెస్టు చేసి, పెద్ద మొత్తంలో నిల్వలు స్వాధీనం చేసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని