13 బృందాలు.. 38 కేసులు
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

13 బృందాలు.. 38 కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: గంజాయిపై రాచకొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్వోటీ పోలీసులు 13 బృందాలుగా ఏర్పడి 60 పాన్‌షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 38 కేసులు నమోదు చేశారు. గంజాయి సిగరెట్లను తయారు చేసే రోలర్‌ పేపర్లు, గమ్‌ స్టిక్కర్లు, గుట్కా, హుక్కా ఫ్లేవర్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌లో 12, చైతన్యపురిలో 6, సరూర్‌నగర్‌లో 6, వనస్థలిపురంలో 3, మీర్‌పేట్‌లో 8, నేరెడ్‌మెట్‌, మేడిపల్లి, ఘట్‌కేసర్‌ ఠాణాల పరిధిలో ఒక్కో కేసు నమోదు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని