బంగారు ఆభరణాలున్న పర్సు చోరీ
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

బంగారు ఆభరణాలున్న పర్సు చోరీ

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలి చేతి సంచిలో ఉన్న పర్సు చోరీకి గురైన ఘటన ఇది. ఎస్సై చందర్‌సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం... చందానగర్‌లో నివసించే నముడూరి అన్నపూర్ణ మహాలక్ష్మి నారాయణగూడలోని ఓ హోటల్‌లో దగ్గరి బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం చందానగర్‌ బస్టాప్‌లో ఉప్పల్‌ డిపో బస్సు ఎక్కారు. 9 గంటల ప్రాంతంలో నారాయణగూడలో దిగి ఆటోలో హోటల్‌కు చేరుకున్న తరువాత ఆటో డ్రైవర్‌కు డబ్బులు ఇద్దామంటే ఆమె సంచిలో ఉన్న పర్సు కనిపించలేదు. అందులో రూ.5 లక్షల విలువ చేసే పది తులాల బంగారు గాజులు, రూ.5,500 నగదు, రెండు ఏటీఎం కార్డులు ఉన్నాయని నారాయణగూడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని