బీసీ ఉద్యమ బలోపేతానికి రాష్ట్రాల పర్యటన
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

బీసీ ఉద్యమ బలోపేతానికి రాష్ట్రాల పర్యటన

గుజ్జ కృష్ణను సన్మానిస్తున్న శారదాగౌడ్‌, నేతలు

కాచిగూడ, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్రాల వారిగా పర్యటన చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌గా నూతనంగా నియమితులైన ఆయనను ఆదివారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జి.శారదాగౌడ్‌ ఆధ్వర్యంలో సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. ఆర్‌.కృష్ణయ్య నాయకత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. బీసీ కులాల వారిగా జనాభా గణన, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ క్రిమిలేయర్‌ రద్దు, చట్ట సభలు, బీసీ ఉద్యోగుల పదోన్నతులలో రిజర్వేషన్లు తదితర వాటిపై చేసే పోరాటానికి రాష్ట్రాల వారిగా బీసీల మద్దతు కూడగడతామన్నారు. పీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్‌, కోల జనార్ధన్‌, ఉదయ్‌నేత, శివమ్మ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని