TS News: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం
eenadu telugu news
Updated : 25/10/2021 12:46 IST

TS News: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 59 వేల మంది విద్యార్థులుండగా.. 1768 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి నవంబర్ 3వ తేదీ వరకు జరగనున్న పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ప్రకటించారు. గతేడాది కొవిడ్ కారణంగా పరీక్షల నిర్వహణ జరగలేదని.. కోర్టు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌ నగరంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సోమవారం నుంచి నవంబరు 3వ తేదీ వరకూ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని గ్రేటర్‌ జోన్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు రూట్‌ పాస్‌ కాని, విద్యార్థి జనరల్‌ బస్‌పాస్‌ కాని చూపడంతో పాటు హాల్‌టికెట్‌ కూడా తప్పనిసరి చూపించాల్సి ఉంటుందని వివరించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని