వృద్ధురాలిని పొడిచిన ఆవు ఘటన.. పోషకుడిపై కేసు
eenadu telugu news
Published : 26/10/2021 05:04 IST

వృద్ధురాలిని పొడిచిన ఆవు ఘటన.. పోషకుడిపై కేసు

జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: జవహర్‌నగర్‌లోని శాంతినగర్‌ కాలనీలో నివసించే పోచమ్మ(70)ను ఆవు పొడిచిన ఘటనకు సంబంధించి పోలీసు కేసు నమోదైంది. బాధితురాలి తనయుడు లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు ఆవు పోషకుడు శాంతినగర్‌కు చెందిన టీకాధర్‌ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఆవు కొన్నిరోజులుగా స్థానికులను పొడుస్తున్నా, కట్టడి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారన్నది పోషకుడిపై అభియోగమని దర్యాప్తు అధికారి ఎస్సై మోహన్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని