రూ.10 లక్షల విలువైన విదేశీ కరెన్సీ పట్టివేత
eenadu telugu news
Published : 26/10/2021 05:04 IST

రూ.10 లక్షల విలువైన విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నుంచి అబుదాబీకి రహస్యంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ ఇంటెలిజెన్స్‌ బృందం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికురాలిని అరెస్టు చేసి కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఆలియా భాను(40) ఎతిహాద్‌  ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌లో అబుదాబీకి వెళుతోంది. ఈ క్రమంలో రూ.10.09 లక్షల విలువైన సౌదీ అరేబియాకు చెందిన కరెన్సీని తన సామగ్రిలో రహస్యంగా పెట్టుకుని విమానాశ్రయానికి వచ్చింది.  భద్రతాధికారుల తనిఖీలో విదేశీ నగదు తరలింపు గుట్టురట్టయింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని