నవాబుల చరితకు నగిషీలు
eenadu telugu news
Published : 26/10/2021 05:04 IST

నవాబుల చరితకు నగిషీలు

కుతుబ్‌షాహీ టూంబ్స్‌కి పూర్వవైభవం

కట్టడాలకు వాడుతున్న సున్నం, బంక, ఎండిన పూలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌; న్యూస్‌టుడే గోల్కొండ: నవాబుల చారిత్రక వైభవానికి ప్రతీకలైన ‘సెవెన్‌ టూంబ్స్‌’కు ఆనాటి శాస్త్రీయ పద్ధతిలో మెరుగులు అద్దుతోంది ఆగాఖాన్‌ ట్రస్ట్‌. గోల్కొండ కేంద్రంగా దక్కన్‌ రాజ్యాన్ని 175 ఏళ్లు ఏలిన కుతుబ్‌షాహీల్లోని ఏడుగురు నవాబుల సమాధులను ఇండో పర్షియన్‌ శైలిలో నిర్మించారు. అవి కళావిహీనంగా మారుతుండటంతో, ఆగాఖాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఐదేళ్ల క్రితం పునరుద్ధరణ పనులు చేపట్టి 75 శాతం పూర్తి చేశారు. ప్రపంచ వారసత్వాన్ని కాపాడుకునేందుకు పురావస్తుశాఖ, ఆగాఖాన్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ కల్చర్‌ కలిసి కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్క్‌ ప్రాజెక్టును చేపట్టాయి.

వేగంగా ఆధునికీకరణ.. టూంబ్స్‌, మసీదులు, మార్చురీ బాత్‌, బడీ బౌలి నిర్మాణాలను పునరుద్ధరించి పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. అతిపెద్దదైన మెట్లబావి బడీ బౌలితోపాటు మరో 7 బావుల్ని పునరుద్ధరించారు. రసాయనాలు వాడకుండా బెల్లం, సహజ గమ్‌, ఎండిన పువ్వులు, డంగు సున్నం తదితరాలతో వన్నెలద్దారు. ఇప్పటికే సుల్తాన్‌ కులీ కుతుబ్‌షా, హయత్‌ బక్షీ బేగం సమాధుల సుందరీకరణ పూర్తయింది. అతిపెద్దదైన సుల్తాన్‌ కులీ కుతుబ్‌ షా సమాధిని ప్రత్యేక ఆకర్షణలతో పునరుద్ధరించారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని