మూడు రోజుల్లో మ్యుటేషన్లు పూర్తవ్వాలి
eenadu telugu news
Published : 26/10/2021 05:53 IST

మూడు రోజుల్లో మ్యుటేషన్లు పూర్తవ్వాలి

ఈనాడు, హైదరాబాద్‌: ఏడాదిగా ఆమోదానికి నోచుకోని మ్యుటేషన్ల దరఖాస్తులు, కిందిస్థాయి సిబ్బంది, అధికారుల చేతివాటంపై సోమవారం ‘ఈనాడు’లో ‘ముడుపులిస్తేనే.. మ్యుటేషన్లు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై పురపాలకశాఖ స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని.. జీహెచ్‌ఎంసీని సీఎం కార్యాలయం ఆదేశించింది. సర్కిళ్లవారీగా అర్జీల పరిశీలనను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, మూడు రోజుల్లో ఆమోదించడమో, తిరస్కరించడమో చేయాలని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ ఉపకమిషనర్లందరికీ ఆ విషయమై ఉదయాన్నే టెలికాన్ఫరెన్సులో ఆదేశాలిచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని