బిజినెస్‌ అనలిటిక్స్‌కు ఉజ్వల భవిష్యత్తు
eenadu telugu news
Published : 26/10/2021 05:57 IST

బిజినెస్‌ అనలిటిక్స్‌కు ఉజ్వల భవిష్యత్తు


ఐఎస్‌బీలో ఏఎంపీబీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: బిజినెస్‌ అనలిటిక్స్‌ విద్యకు ఉజ్వల భవిష్యత్తుందని బ్రాడ్‌రిడ్జ్‌ ఇండియా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.లక్ష్మీకాంత్‌ పేర్కొన్నారు. గచ్చిబౌలి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం ఇన్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌ (ఏఎంపీబీఏ) కోర్సు (2020 శీతాకాలం) పూర్తి చేసిన డేటా సైన్స్‌ వృత్తి నిపుణులకు సోమవారం సర్టిఫికెట్ల ప్రదానోత్సవం (గ్రాడ్యుయేషన్‌ డే) నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐఎస్‌బీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డేటా సైన్స్‌ డైరెక్టర్‌ ప్రొ.మనిష్‌ గంగ్వార్‌ కూడా ప్రసంగించారు. భరత్‌ భూషణ్‌ అనే విద్యార్థి బంగారు పతకాన్ని సాధించగా.. రాజేష్‌రెడ్డి రజత పతకం సాధించారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని