‘సినిమా రంగమూ విడిపోవాల్సిందే’
eenadu telugu news
Published : 26/10/2021 06:02 IST

‘సినిమా రంగమూ విడిపోవాల్సిందే’

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: విభజన చట్టం ప్రకారం సినిమా రంగం కూడా విడిపోవాలని ఓయూ లా కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొ.గాలి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం సుందరయ్య కళానిలయంలో తెలంగాణ టీవీ ఫిలిం డెవలప్‌మెంట్‌ ఐకాస సమావేశం జరిగింది. ముఖ్య అతిథి ప్రొ.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయినా తెలంగాణలో సినిమా రంగం కొందరు సీమాంధ్ర వారి చేతుల్లోనే కొనసాగుతోందన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ కళాకారులకు 48 శాతం వాటా దక్కాలన్నారు. చిత్రపురి కాలనీలో కేటాయించిన ఇళ్లలో రూ.వేలకోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఐకాస కన్వీనర్‌ మురళీధర్‌దేశ్‌పాండే మాట్లాడుతూ.. తెలంగాణ హీరోలు, దర్శకులు, కళాకారులు, కార్మికులకు న్యాయం చేయడంలో తెరాస విఫలమైందన్నారు. సుంకరి సత్యనారాయణ, మేకల శ్రీనివాస్‌, మాధురి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని