Crime News: హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లో దారి దోపిడీ
eenadu telugu news
Published : 26/10/2021 21:24 IST

Crime News: హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లో దారి దోపిడీ

హైదరాబాద్‌: నగరంలోని లంగర్‌హౌస్‌ ప్రాంతంలో దారి దోపిడీ కలకలం రేగింది. లంగర్ హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పీపీ ఎక్స్‌ప్రెస్ పిల్లర్‌ నంబర్‌ 72 వద్ద ఈ ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆపిన మరో ద్విచక్ర వాహనదారుడు వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం అనంతరం వ్యక్తిపై దాడి చేసి బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌ లాక్కొని అక్కడ నుంచి పరారయ్యాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని