డీఎస్పీ కార్యాలయ ఆవరణలోమహిళ ఆత్మహత్యాయత్నం
eenadu telugu news
Published : 27/10/2021 01:45 IST

డీఎస్పీ కార్యాలయ ఆవరణలోమహిళ ఆత్మహత్యాయత్నం

తాండూరు టౌన్‌: తాండూరులోని డీఎస్పీ కార్యాలయం ఆవరణలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తదితరులు తెలిపిన వివరాల ప్రకారం... తాండూరు మండలం కొత్లాపూరు గ్రామానికి చెందిన రేణుకకు ఆమె సమీప బంధువులకు కొంత కాలంగా భూ వివాదం జరుగుతోంది. ఇదే విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధ్యులను రిమాండ్‌కు పంపించ లేదనే ఆందోళనతో ఆమె మంగళవారం తనవెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను డీఎస్పీ కార్యాలయం ఆవరణలో ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న పోలీసులు పెట్రోల్‌ డబ్బాను లాగేసుకుని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదే విషయాన్ని ఆమె మీడియాకు వివరించారు. పోలీసు అధికారి భార్యనై ఉండి కూడా తనకు న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై విచారణ చేస్తామని పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని