రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
eenadu telugu news
Published : 27/10/2021 01:45 IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రాయికోడ్‌: ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందినట్లు ఎస్సై ఏడుకొండలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం... ఈనెల 25న సాయంత్రం రాయికోడ్‌ మండలంలోని హస్నాబాద్‌ గ్రామానికి చెందిన చీలపల్లి శంషయ్య(30) ఝరాసంగంలోని నర్సాపూర్‌ నుంచి తన స్వగ్రామమైన హస్నాబాద్‌కు ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. మునిపల్లి మండలంలోని పెద్దచెల్మెడ గ్రామానికి చెందిన ఎలబంటి శంకర్‌(50) సింగీతం నుంచి పెద్దచెల్మెడ గ్రామానికి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో సింగీతం శివారులోని ప్రధాన రహదారిపై ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఇరువురి తలలకు తీవ్రమైన గాయాలై రక్తస్రావం జరిగింది. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ సాయంతో జహీరాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో శంషయ్యను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి, శంకర్‌ను సురారం మాల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ.. శంషయ్య మంగళవారం ఉదయం 3 గంటలకు, శంకర్‌ ఉదయం 6 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. శంషయ్య భార్య విజయలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

కాలుజారి పడి మరొకరు..

కంగ్టి: కంగ్టిలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తున్న వికారాబాద్‌ జిల్లా ధారూర్‌కు చెందిన మల్లెష్‌(40) సోమవారం రాత్రి వసతిగృహం ఆవరణలో అరుగు మీదినుంచి జారిపడి అక్కకడిక్కడే మృతిచెందినట్లు సీసీ టీవీ పుటేజీలో నమోదైందని ఏఎస్‌ఐ నారాయణ తెలిపారు. గుండె సంబంధిత అనారోగ్యంతో ఆయన కాలుజారి పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లేశ్‌ భార్య సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని