కుమారుడి ద్విచక్ర వాహనంపైనుంచి పడి మహిళ దుర్మరణం
eenadu telugu news
Published : 27/10/2021 02:46 IST

కుమారుడి ద్విచక్ర వాహనంపైనుంచి పడి మహిళ దుర్మరణం

పటాన్‌చెరు అర్బన్‌: కుమారుడు తల్లిని ద్విచక్ర వాహనంపై తీసుకెళుతూ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో కింద పడి తల్లి మృతి చెందిన విషాద ఘటన ఇది. పురానాపూల్‌ శివలాల్‌నగర్‌ వాసి సక్కుబాయి(45)ని ఆమె కుమారుడు మాణిక్‌ ద్విచక్ర వాహనంపై రాజోల్‌లోని బంధువుల ఇంట్లో వేడుక కోసం ఈ నెల 26న తీసుకెళ్లాడు. ఇస్నాపూర్‌ శివారులో కారు డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో వేగంగా వెళ్తోన్న మాణిక్‌ కూడా బ్రేక్‌ వేశాడు. అదుపు తప్పి వెనుక కూర్చుని ఉన్న అతని తల్లి కిందపడిపోయింది. తీవ్ర గాయాలతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటాన్‌చెరు ఎస్సై సాయిలు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని