తక్కువ ధరకు బంగారం ఇస్తామని...రూ. 42 లక్షలకు టోకరా
eenadu telugu news
Published : 27/10/2021 02:46 IST

తక్కువ ధరకు బంగారం ఇస్తామని...రూ. 42 లక్షలకు టోకరా

కాచిగూడ, న్యూస్‌టుడే: తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించి రూ.42 లక్షలతో ఉడాయించిన ఘటన కాచిగూడ ఠాణా పరిధిలో జరిగింది. డీఐ యాదేందర్‌ కథనం ప్రకారం...మల్లేపల్లికి చెందిన అబ్దుల్‌ అఫ్రోజ్‌ కాచిగూడలో వీకేర్‌ డయోగ్నస్టిక్స్‌ నిర్వహిస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన దిల్లీకి చెందిన అమిత్‌ అనే వ్యక్తి తక్కువ ధరకు బంగారం విక్రయిస్తానని అఫ్రోజ్‌ను నమ్మించాడు. రెడ్డి అనే వ్యక్తిని కలవాలంటూ ఫోన్‌నంబరు ఇచ్చాడు. అతనిద్వారా ముఖేశ్‌ అనే వ్యక్తి కలిసి బంగారం బిస్కెట్‌ను చూపించాడు. సోమవారం కిరణ్‌ అనే వ్యక్తి వృద్ధుడితో కలిసి వీకేర్‌ డయోగ్నస్టిక్స్‌కు వచ్చాడు. కిలో బంగారానికి రూ.42 లక్షలు ఇవ్వాలని కోరాడు. నగదు బ్యాగును అఫ్రోజ్‌ తాళం వేసి వృద్ధుడు తెచ్చిన పెట్టెలో పెట్టాడు. పెట్టెలో బ్యాగును తారుమారు చేసి తెల్ల కాగితాలు ఉంచిన బ్యాగును వెనక్కి ఇచ్చి బంగారం తెస్తామంటూ వారు ఆటోలో వెళ్లిపోయారు. తర్వాత చూసుకున్న బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని