ఆస్తి పన్ను బకాయిదారులకు రెడ్‌ నోటీసులు
eenadu telugu news
Published : 27/10/2021 02:46 IST

ఆస్తి పన్ను బకాయిదారులకు రెడ్‌ నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లోని ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్‌ఎంసీ దూకుడుగా వ్యవహరిస్తోంది. కొన్నేళ్లుగా పన్ను ఎగ్గొడుతున్న యజమానులకు రెడ్‌ నోటీసులు జారీ చేస్తోంది. గడువులోపు స్పందించకపోతే.. నిర్మాణాలకు తాళం వేస్తామని, చరాస్తులను స్వాధీనం చేసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ నిత్యం క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్ర కార్యాలయం జారీ చేస్తోన్న ఆదేశాలను కొందరు కమిషనర్లు ఖాతరు చేయట్లేదని, అందులో భాగంగా ఇటీవల ఆరుగురు ఉప కమిషనర్లకు మెమోలు ఇచ్చారని ఓ సర్కిల్‌ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో తెలిపారు. చార్మినార్‌ జోన్‌ నుంచి అతి తక్కువ మొత్తం పన్ను వసూలవుతోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,850కోట్ల ఆస్తిపన్ను వసూలవ్వాలనేది జీహెచ్‌ఎంసీ లక్ష్యం. ఇప్పటివరకు రూ.880కోట్లు ఖజానాకు చేరింది. నెలాఖరులోపు రూ.950కోట్లకు చేరాలని కమిషనర్‌ అధికారులకు స్పష్టంచేశారు. జనన, మరణ ధ్రువపత్రాల జారీ, మ్యుటేషన్లు, ఇతర పౌరసేవల్లో లోపాలు తలెత్తకుండా నిత్యం జోన్ల పరిధిలో సమీక్ష జరగాలని లోకేష్‌కుమార్‌ జోనల్‌ కమిషనర్లకు స్పష్టంచేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని