చిత్ర వార్తలు
eenadu telugu news
Published : 27/10/2021 03:00 IST

చిత్ర వార్తలు

అంతమ్మ.. బిడ్డపై ప్రేమ అనంతమమ్మ

87 ఏళ్లు వచ్చినా శ్రమకు సెలవివ్వకుండా కుండల వ్యాపారం చేస్తున్న ఈ వృద్ధురాలి పేరు అంతమ్మ. అల్లుడు చనిపోవడంతో కుమార్తె దగ్గరే ఉంటోంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఒక్కతే కష్టపడుతుండడంతో వయసు సహకరించకపోయినా ఖాళీగా ఉండలేక ఆసిఫ్‌నగర్‌ మహాత్మాగాంధీ చౌక్‌లోని కుమార్తె దుకాణం వద్ద రోజంతా కుండలు విక్రయిస్తోంది.

 


పెచ్చులూడిపడుతున్నా తలకెక్కదా?

ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. చర్మవ్యాధుల విభాగం ఓపీలో విధి నిర్వహణలో ఉన్న ఓ జూనియర్‌ వైద్యురాలిపై సోమవారం సీలింగ్‌ ఫ్యాన్‌ పడి గాయాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జుడాలు మంగళవారం శిరస్త్రాణాలు ధరించి రోగులకు పరీక్షలు నిర్వహించారు.

-న్యూస్‌టుడే, ఉస్మానియా ఆసుపత్రి


సిత్రాలుసూరో

వర్ణ రంజితం.. వెదురు వాడకం!

రోజువారి వినియోగంలో ప్లాస్టిక్‌ డబ్బాలు, బుట్టలకు బదులు పర్యావరణానికి హాని చేయని వెదురువి వాడేందుకు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. చాదర్‌ఘాట్‌లో కొన్ని కుటుంబాలు వీటి తయారీలోనే ఉంటున్నాయి. పండగ రోజుల్లో బహుమతులు ఇవ్వడానికి ఆకట్టుకునేలా రంగుల్లో తయారుచేస్తున్నారు.


బతుకు బండి.. చదువుతోనే మారునండి!

హయత్‌నగర్‌ మండలం కుంట్లూరులో ఓ చిన్నారి.. తన తల్లి తోపుడు బండిపై తినుబండారాలను విక్రయిస్తుండగా ఆమె సహాయంతో అక్కడే పాఠశాల హోంవర్క్‌లో భాగంగా రాతపని చేసుకుంటున్న చిత్రమిది.


పాదబాట.. నడవలేం ఇచట!

కోఠిలోని ఉమెన్స్‌ కాలేజీ దారిలో ఫుట్‌పాత్‌ మొత్తాన్ని వాహనాల పార్కింగ్‌ ప్రాంతంగా వాడేస్తున్నారు. కళాశాల విద్యార్థినులు, ఇతర పాదచారులు రోడ్డుపై తీవ్రమైన ట్రాఫిక్‌ మధ్య వెళ్లాల్సి వస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని