వృద్ధ దంపతుల హత్య కేసునిందితుడికి యావజ్జీవం
eenadu telugu news
Published : 27/10/2021 03:37 IST

వృద్ధ దంపతుల హత్య కేసునిందితుడికి యావజ్జీవం


ఫహీముద్దీన్‌

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసి చోరీకి పాల్పడ్డ నిందితుడికి జిల్లా 4వ అదనపు సెషన్స్‌ జడ్జి రాజగోపాల్‌ జీవిత ఖైదు, రూ.5,000 జరిమానా విధిస్తూ తీరునిచ్చారు. అదనపు పీపీ గంగారెడ్డి కథనం ప్రకారం.. విశ్రాంత ఉద్యోగి వేదల సింహాద్రి(67), విశ్రాంత ఉపాధ్యాయురాలు వేదల సులోచన(62) దంపతులు రాజేంద్రనగర్‌ మండలం సాయిహర్షనగర్‌లో ఒంటరిగా ఉంటున్నారు. మొయినాబాద్‌ సహారాకాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ ఫహీముద్దీన్‌(40) పాత విద్యార్థిగా పరిచయం చేసుకున్నాడు. దంపతులను తన ఆటోలో తీసుకెళ్లి కిరాయి తీసుకోకుండా హైదర్షాకోట్‌లో ఇంట్లో దింపాడు. నాలుగైదుసార్లు ఆటోతో సాయం చేసి చనువు పెంచుకున్నాడు. ఆర్థికంగా కుంగిపోయిన ఫహీముద్దీన్‌.. పథకం ప్రకారం 2014నవంబరు 11న సాయంత్రం మద్యం తాగి దంపతుల ఇంటికి వెళ్లి దారుణంగా హత్య చేసి వారి ఒంటిపై ఉన్న ఆభరణాలు దొంగిలించుకొని పారిపోయాడు. తన చరవాణి అక్కడే పడిపోయింది. నార్సింగి పోలీసులు ఆ చరవాణి ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని