అలా బిల్లు.. ఇలా చెల్లింపు
eenadu telugu news
Published : 27/10/2021 03:37 IST

అలా బిల్లు.. ఇలా చెల్లింపు

ఐఎస్‌బీఎంతో కరెంటు మీటర్ల రీడింగ్‌


ప్యారడైజ్‌ సెక్షన్‌ పరిధిలో కొత్త విధానం ప్రకారం బిల్లింగ్‌ తీస్తున్న విద్యుత్తు సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ప్రతి నెలా ఇంటింటికి తిరిగి కరెంట్‌ బిల్లులు జారీ చేస్తున్నా.. బిల్లు చేతికందిన వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లింపు మాత్రం సాధ్యపడటం లేదు. ప్రధాన సర్వర్‌లో అప్‌లోడ్‌ కాకపోవడంతో అప్పుడే తీసిన బిల్లు ఆన్‌లైన్‌లో చూపించడం లేదు. ఇందుకు ఒకటి రెండు రోజుల సమయం పడుతోంది. మున్ముందు ఈ సమస్య ఉండదంటోంది దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ. బిల్లు తీసిన మరుక్షణమే ఆన్‌లైన్‌లోనూ వచ్చేలా ఇంటిగ్రేటెడ్‌ స్పాట్‌ బిల్లింగ్‌ మెషిన్‌(ఐఎస్‌బీఎం) ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్‌ సర్కిల్‌లోని ప్యారడైజ్‌ సెక్షన్‌లో డిస్కం చేపట్టింది. అన్ని సర్కిళ్లలో ఒక్కో సెక్షన్‌లో ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. జీపీఆర్‌ఎస్‌ అనుసంధానంతో తక్షణం ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ అవుతోందని ఇంజినీర్లు చెబుతున్నారు. వచ్చే రెండు నెలలు పరిశీలించి కొత్త సంవత్సరం నుంచి నగరంలోని అన్ని సర్కిళ్లలో వినియోగదారుకు ఇలాగే బిల్లులు జారీ చేసేందుకు డిస్కం కసరత్తు చేస్తోంది. బిల్‌ రీడర్‌ మీ ఇంటి ప్రాంగణంలో ఉండగానే మొబైల్‌కు సందేశం వస్తుంది. అనుమానాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవచ్ఛు పరిశీలించి ఒకవేళ తప్పుగా ఉంటే కొత్త బిల్లు జారీ చేస్తారు.

డిస్కంకు లాభమే.. ఈ విధానం ప్రకారం ఆన్‌లైన్‌లో తొలి రోజే చెల్లించే వారి సంఖ్య పెరగనుంది. ఇలా ముందుగానే డిస్కం ఖాతాకు ఆదాయం చేరనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని