29న పలుచోట్ల నీటి సరఫరా బంద్‌
eenadu telugu news
Published : 27/10/2021 03:37 IST

29న పలుచోట్ల నీటి సరఫరా బంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: మంజీరా నీటి సరఫరా వ్యవస్థలో కలబ్‌గూర్‌ నుంచి పటాన్‌చెరు ప్రాంతాల వరకు ఏర్పడిన లీకేజీలకు మరమ్మతులు చేయడానికి నీటి సరఫరా బంద్‌ చేస్తున్నట్లు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 29న ఉదయం 6 నుంచి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు సరఫరా నిలిచిపోతుందని పేర్కొంది. ఇందులో హైదర్‌నగర్‌, రాంనరేష్‌నగర్‌, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్‌, వసంత్‌ నగర్‌, ఎస్‌పీనగర్‌, మియాపూర్‌, దీప్తినగర్‌, శ్రీనగర్‌, మాతృశ్రీనగర్‌, లక్ష్మీనగర్‌, జేపీనగర్‌, చందానగర్‌, నిజాంపేట్‌, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్‌, బొల్లారం ప్రాంతాలు ఉన్నట్లు తెలిపింది. స్థానిక ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని