సికింద్రాబాద్‌లో నేడు రుణ మేళా
eenadu telugu news
Published : 27/10/2021 04:57 IST

సికింద్రాబాద్‌లో నేడు రుణ మేళా

నాంపల్లి, న్యూస్‌టుడే: రుణ మేళా పేరిట ఈనెల 27న రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రవిశంకర్‌ఠాగూర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించి రుణాల మంజూరు- తిరిగి చెల్లింపు, వడ్డీ రేట్లు తదితర వివరాలపై ప్రజలకు బ్యాంకర్లు అవగాహన కల్పిస్తారన్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ రుణ మేళా వేదికలో వారి స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని